Jabilli Kosam Song Lyrics in Telugu
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై…

నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై…

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా…

Moreover, Read also Jayakrishna Mukunda Murari Song Lyrics in Telugu
ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా…
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా ఊహల్లో తేలి ఉర్రూతలూగి…
మేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను రావా దేవి…
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై…
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై…
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై…
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా…

ఉండి లేకా ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే…
Check more song is about Alara Chanchalamaina Song Lyrics
నా రేపటి అడియాశల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే…
నీ దగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే…
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై…
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై…
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై…
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై… వేచాను నీ రాకకై…