Jayakrishna Mukunda Murari Song Lyrics in Telugu

Jayakrishna Mukunda Murari Song Lyrics in Telugu

హే… కృష్ణా…. ముకుందా…. మురారీ….
జయ కృష్ణా… ముకుందా… మురారి
జయ కృష్ణా… ముకుందా… మురారి
జయ గోవింద బృందావిహారీ…

కృష్ణా… ముకుందా… మురారి
జయ గోవింద బృందావిహారీ…
కృష్ణా… ముకుందా… మురారి

దేవకి పంట… వసుదేవువెంట….
దేవకి పంట… వసుదేవువెంటా…
యమునను నడిరేయి దాటితివంటా.. ఆ..ఆ
వెలసితివంటా… నందుని ఇంటా
వెలసితివంటా… నందుని ఇంటా
వ్రేపల్లె ఇల్లాయేనంటా…ఆ..

కృష్ణా… ముకుందా… మురారి
జయ గోవింద బృందావిహారీ… ఈ..
కృష్ణా… ముకుందా… మురారి

నీ పలుగాకి పనులకు గోపెమ్మ…
నీ పలుగాకి పనులకు గోపెమ్మ…
కోపించి నిను రోట బంధించెనంటా..ఆ..ఆ..
ఊపునబోయీ మాకులకూలిచి….
ఊపునబోయీ మాకులకూలిచి…
శాపాలు బాపితివంటా….ఆ…

కృష్ణా… ముకుందా… మురారి
జయ గోవింద బృందావిహారీ…
కృష్ణా… ముకుందా… మురారి

Apart from this, reading Alara Chanchalamaina Lyrics Song in Telugu

అమ్మా.. తమ్ముడు మన్ను తినేనూ…
చూడమ్మా అని రామన్న తెలుపగా
అన్నా.. అని చెవి నులిమి యశోద..
ఏదన్నా నీ నోరు చూపుమనగా…ఆ…
చూపితివట నీ నోటను…
బాపురే పదునాల్గు భువనభాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు…
తాపము నశియించి.. జన్మ ధన్యత గాంచెన్..

జయ కృష్ణా… ముకుందా… మురారి
జయ గోవింద బృందావిహారీ… ఈ…
కృష్ణా… ముకుందా… మురారి

కాళీయ ఫణిఫణ జాలాన ఝణఝణ…
కాళీయ ఫణిఫణ జాలాన ఝణఝణ…
కేళీ ఘటించిన గోపకిశోరా..ఆ..ఆ
కంసాదిదానవ గర్వాపహారా…
కంసాదిదానవ గర్వాపహారా…
హింసా విదూరా.. పాపవిదారా…

కృష్ణా… ముకుందా… మురారి
జయ గోవింద బృందావిహారీ… ఈ..
కృష్ణా… ముకుందా… మురారి

Furthermore reading about: Jeya Jeya Devi Lyrics in Tamil

కస్తూరి తిలకం… లలాట ఫలకే
వక్షస్థలే కౌస్తుభం… నాసాగ్రే నవమౌక్తికమ్
కరతలే వేణుమ్… కరే కంకణమ్
సర్వాంగే హరిచందనంచ కలయమ్
కంఠేచ ముక్తావళీమ్.. గోపస్త్రీ పరివేష్టితో…
విజయతే… గోపాల చూడామణీ…
విజయతే… గోపాల చూడామణీ…

లలిత లలిత మురళీ స్వరాళీ…
లలిత లలిత మురళీ స్వరాళీ…
పులకిత వనపాళి… గోపాళీ..
పులకిత వనపాళి…ఈ…
విరళీకృత నవ రాసకేళి…
విరళీకృత నవ రాసకేళి…
వనమాలీ శిఖిపింఛమౌళీ
వనమాలీ శిఖిపింఛమౌళీ….

కృష్ణా… ముకుందా… మురారి…
జయ గోవింద.. బృందావిహారీ…
కృష్ణా… ముకుందా… మురారి…
జయ గోవింద.. బృందావిహారీ…
కృష్ణా… ముకుందా… మురారి..
జయ కృష్ణా… ముకుందా… మురారి..
హే… కృష్ణా…. ముకుందా…. మురారీ…. ఈ.. ఈ..

Leave a Comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.