Poolane Kunukeyamanta Song lyrics in Telugu

Poolane Kunukeyamanta Song lyrics in Telugu

పూలనే కునుకేయమంటా..

తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా ..

పూలనే కునుకేయమంటా..

తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..

హే..ఐ అంటే మరి నేనను అర్థము..

తెలిసోయ్ నిన్న మొన్న..

అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..

ఎద చెబుతుంటే విన్నా..

అయ్యో నాకెదురై ఐరావతమే..

నేలకి పంపిన తెలి కలువై..

తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..

పూలనే కునుకెయ్యమంటా..

తను వచ్చెనంటా…తను వచ్చెనంటా..

అసలిపుడు నీ కన్నా ఘనుడు లోకాన ..

కనబడునా మనిషై..

అది జరగదని ఇలా అడుగు వేసిన..

నిన్ను వలచిన మనసై..

ప్రతి క్షణము క్షణము..

నీ అణువు అణువులను కలగన్నది నా ఐ..

ఇన్ని కలల ఫలితమున..

కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై..

నా చేతిని వీడని గీత నువై ..

నా గొంతుని వీడని పేరు నువై ..

తడి పెదవులు తళుకవనా..

నవ్వునవ్వనా.. ఎంత మధురము..

పూలనే కునుకేయమంటా..

తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..

హే..ఐ అంటే మరి నేనను అర్థము..

తెలిసోయ్ నిన్న మొన్న..

అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..

ఎద చెబుతుంటే విన్నా..

అయ్యో నాకెదురై ఐరావతమే..

నేలకి పంపిన తెలి కలువై..

తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..

నీరల్లే జారేవాడే నా కోసం ఒక ఓడయ్యాడా..

నీడంటూ చూడనివాడే నన్నే దాచిన మేడయ్యాడా..

నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా..

నా రాతి గుండెని తాకుతూ..

శిల్పం లాగా మార్చేసిందా..

యుగములకైనా మగనిగా వీణ్ణే..

పొడగాలి అంటూ ఉంది నాలో మనసివ్వాళే..

ప్రతి ఉదయాన తన వదనాన్నే..

నయనము చూసేలాగా వరమేదైనా కావాలే..

పూలనే కునుకేయమంటా..

తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..

హే..ఐ అంటే మరి నేనను అర్థము..

తెలిసోయ్ నిన్న మొన్న..

అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..

ఎద చెబుతుంటే విన్నా..

అయ్యో నాకెదురై ఐరావతమే..

నేలకి పంపిన తెలి కలువై..

తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..

పూలనే కునుకెయ్యమంటా..

తను వచ్చెనంటా…తను వచ్చెనంటా..

Keep reading
Vaalu Kanula Daana Song Lyrics in Telugu
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.