Song: Aakasam Baddalaina
Singers: Sagar, Megha
Music: Devi Sri Prasad
Lyrics: Ananth Sriram
Aakasam Baddalaina Song Lyrics In Telugu
ఆకాశం బద్దలైనా సౌండు గుండెల్లోన
మోగుతుంది నిన్ను కలిశాక
మేఘాలే గుద్దుకున్న లైటు కళ్లల్లోన
చేరుకుంది నిన్ను కలిశాక
రై రై రై రైడ్ చేసెయ్… రాకెట్‌లా మనసునీ
సై సై సై సైడ్ చేసెయ్… సిగ్నల్స్‌తో ఏంపనీ
ఇక హైవేలైనా వన్‌వేలైనా… కదలదే బండి తేరే బినా
ఆకాశం బద్దలైనా సౌండు గుండెల్లోన
మోగుతుంది నిన్ను కలిశాక
మేఘాలే గుద్దుకున్న లైటు కళ్లల్లోన
చేరుకుంది నిన్ను కలిశాక
పార్టీలా ఉంది నీతోటి ప్రతిక్షణం
ఎందుకంటే చెప్పలేను కారణం
టేస్టీగా ఉంది నువ్ చెప్పే ప్రతి పదం
బాగుందబ్బా మాటల్లోన ముంచడం
హే, రోలర్ కోస్టర్ ఎంతున్నా… ఈ థ్రిల్లిస్తుందా జాణా
నీతో పాటు తిరిగేస్తుంటే జోరే తగ్గేనా
కార్టూన్ చానెల్‌లోనైనా… ఈ ఫన్నుందా లోలోనా
నీతో పాటు గడిపేస్తుంటే టైమే తెలిసేనా
ఇక సాల్సాలైనా సాంబాలైనా… కదలదే ఒళ్లు తేరే బినా
ఆకాశం బద్దలైనా సౌండు గుండెల్లోన
మోగుతుంది నిన్ను కలిశాక
హే.. మేఘాలే గుద్దుకున్న లైటు కళ్లల్లోన
చేరుకుంది నిన్ను కలిశాక
ఆన్‌లైన్‌లో నువ్వు హాయ్ అంటే
నా మది క్లౌడ్ నైన్‌లోకి నన్ను తోస్తది
ఆఫ్‌లైన్‌లో నువ్వు ఉన్నావంటే
మది కోల్ మైన్‌లోకి కూరేస్తది
ఓ ఏ ప్లేస్ అయినా గ్రీటింగ్ కార్డ్‌లా కనిపిస్తుంది చాలా
నాతో పాటు ఈ ఫీలింగు నీకు కొత్తేనా
ఏ రోజైనా వాలెంటైన్స్ డే అనిపిస్తుంది మైనా
నాతోపాటు అడుగేస్తుంటే నీకు అంతేనా
ఇక డేటింగైనా ఫైటింగైనా… గడవదే రోజు తేరే బినా
ఆకాశం బద్దలైనా సౌండు గుండెల్లోన
మోగుతుంది నిన్ను కలిశాక
హెయ్..మేఘాలే గుద్దుకున్న లైటు కళ్లల్లోన
చేరుకుంది నిన్ను కలిశాక