Aakesi Pappesi Rhyme Lyrics Song in Telugu
ఆకేసి. పప్పేసి. బువ్వేసి. నెయ్యేసి
తనకో ముద్ద. నాకో ముద్ద
ఆకేసి. పప్పేసి. బువ్వేసి. నెయ్యేసి
తనకో ముద్ద. నాకో ముద్ద
తినిపించువాడొచ్చే వేళయింది. వళ్ళంతా కళ్ళుగా ఎదురొచ్చింది
ఇలా. ఇలా. ఇలా.ఆ.ఇలా. ఇలా. ఇలా.
చరణం 1:
అతగడే జతగాడు అనుకున్నది. అనుకున్నదే కలలు కంటున్నది
అతగాడే జతగాడు అనుకున్నది. అనుకున్నదే కలలు కంటున్నది
కలలోని విందు… కనులవిందవునా
కలలోని విందు… కనులవిందవునా
మనసులోని ఆశ… మాంగళ్యమౌనా
ఇలా… ఇలా… ఇలా.ఆ.ఇలా… ఇలా… ఇలా
చరణం 2:
ఇది కలా… కలా… కలా… మనమిలా. ఇలా… ఇలా
గాలిలా పువ్వులా తావిలా… కలిసి ఉన్నాము కలవకనే
కలుసుకున్నాము… తెలియకనే
వెలుగుకు నీడకు చెలిమిలా… ఒక్కటైనాము కలవకనే
ఒదిగి ఉన్నాము… కరగకనే
ఈ ప్రేమపత్రము.ఈ జన్మకు చెల్లువేయ్యుము
ప్రతి జన్మజన్మకు.మరల తిరగ వ్రాసుకొందము
ఎలా ఎలా ఎలా.ఆ ఆ ఆ
ఇలా ఇలా ఇలా.ఇలా ఇలా ఇలా
ఆకుంది పప్పుంది బువ్వుంది నెయ్యుంది
ఆకలి ఉంది.ఆశ ఉంది
చరణం 3:
వెన్నెల కలువలా చెలువలా మందగించాము… జతలుగ
విందులవుదాము… కథలుగా
కన్నుల పాపలా… చూపులా. చూచుకుందాము… సొగసులుగా
పగలు రేయిగా… రేయి పగలుగా
ఈ రాగసూత్రము… మూడుముళ్ళు వేసుకుందము
ఈ మూగమంత్రము… దీవెనగా చేసుకుందము
ఎలా ఎలా ఎలా.ఆ… ఆ… ఆ…
ఇలా. ఇలా. ఇలా.ఇలా… ఇలా… ఇలా
ఆకుంది పప్పుంది బువ్వుంది నెయ్యుంది
ఆకలి ఉంది.ఆశ ఉంది
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్… మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
Continue reading about
Aa Ke Teri Bahon Mein Song Lyrics