Movie: Antahpuram (30 November 1998)
Director: Krishna Vamsi
Producer: P. Kiran
Singer: Chitra
Music: Ilayaraja
నా ననననా ననననా ననననా
నా ననననా ననననా ననననా
అసలేం గుర్తుకురాదు… నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు… ఓ నిమిషం కూడ నిన్ను చూడక
నీలో ఉంది నా ప్రాణం… అది నీకు తెలుసునా
ఉన్నా నేను నీ కోసం… నువ్వు దూరమైతే బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు… ఓ నిమిషం కూడా నిన్ను చూడక
గోరువెచ్చని ఊసుతో… చిన్న ముచ్చటని వినిపించనీ
ఆకుపచ్చని ఆశతో… నిన్ను చుట్టుకొని చిగురించనీ
అల్లు కొమ్మని గిల్లుతున్నది… చల్చల్లని గాలి
తెల్లవారులు… అల్లరల్లరి సాగించాలి
ఏకమయే..! ఏకమయే ఏకాంతం… లోకమయే వేళ
అహ..! జంట ఊపిరి… వేడికి మరిగింది వెన్నెల
అసలేం గుర్తుకురాదు… నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు… ఓ నిమిషం కూడ నిన్ను చూడక
నీలో ఉంది నా ప్రాణం… అది నీకు తెలుసునా
ఉన్నా నేను నీ కోసం… నువ్వు దూరమైతే బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు… ఓ నిమిషం కూడా నిన్ను చూడక
కంటి రెప్పల చాటుగా… నిన్ను దాచుకుని, బంధించనీ
కౌగిలింతల సీమలో… కోట కట్టుకుని, కొలువుండనీ
చెంత చేరితె… చేతి గాజులు చేసే గాయం
జంట మధ్యన… సన్న జాజులు హాహాకారం
మళ్ళీ మళ్ళీ.. మళ్ళీ మళ్ళీ ఈ రోజు… రమ్మన్నా రాదేమో
నిలవని చిరకాలమిలాగే ఈ క్షణం
అసలేం గుర్తుకురాదు… నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు… ఓ నిమిషం కూడ నిన్ను చూడక
నీలో ఉంది నా ప్రాణం… అది నీకు తెలుసునా
ఉన్నా నేను నీ కోసం… నువ్వు దూరమైతే బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక
Read more:
Amme Narayana Devi Narayana Lyrics Song in Malayalam