Junte Thene Daralakanna Lyrics in Telugu
జుంటె తేనె ధారల కన్నా
యేసు నామమే మధురం
యేసయ్య సన్నిధినే మరువజాలను (2)
జీవితకాలమంతా ఆనందించెదా
యేసయ్యనే ఆరాధించెదా (2) ||జుంటె తేనె||
యేసయ్య నామమే బహు పూజనీయము
నాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి (2)
నన్నెంతగానో దీవించి
జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే (2) ||జుంటె తేనె||
Read also Kaana Karunguyile Song Lyrics in Tamil
యేసయ్య నామమే బలమైన దుర్గము
నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి (2)
నన్నెంతగానో కరుణించి
పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే (2) ||జుంటె తేనె||
యేసయ్య నామమే పరిమళ తైలము
నాలో నివసించే సువాసనగా నను మార్చి (2)
నన్నెంతగానో ప్రేమించి
విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే (2) ||జుంటె తేనె||
Check also
Akkada Unnadu Ayyappa Lyrics Song
Brahma Murari Lyrics Song in Kannada
If you want to watch full video of Junte Thene Daralakanna Lyrics in Telugu then click to below.